Friday, May 17, 2024

తమిళ రాజకీయాల్లో హీరో విజయ్ సంచలనం స్టార్ట్.. అభిమానుల ఉత్సవాలు

spot_img

ప్రస్తుతం తమిళనాడులో హీరో విజయ్ సంచలనమవుతున్నాడు. త్వరలో ఈ తలపతి విజయ్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తుంది. ఒక మెగా ఈవెంట్‌తో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నాడట విజయ్. ప్రస్తుతం చేస్తున్న చిత్రం పూర్తయిన తర్వాత ఏప్రిల్‌లో మధురైలో జరగనున్న తన మొదటి అతిపెద్ద రాజకీయ కార్యక్రమానికి విజయ్ శ్రీకారం చుట్టబోతున్నాడట.

ఇటీవల VMI సమావేశం తర్వాత విజయ్ తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించే ప్రక్రియను ప్రారంభించాడని తెలుస్తుంది. విజయ్ నాయకుడిగా త్వరలో ప్రారంభించనున్న పార్టీకి ‘తమిళగ మున్నేట్ర కజగం’ (టీఎంకే) అని పేరు పెట్టనున్నట్లు సమాచారం. వచ్చే నెలలో విజయ తన పార్టీ రిజిస్టర్ చేయనున్నారట. ఇరాక్ విజయ్ తాజాగా చెన్నైలోని పనైయూర్‌లో 150 మందితో సమావేశమై పార్టీ పేరు, జెండా, అజెండా వంటి విషయాలను కూడా చర్చించినట్టు సమాచారం. పార్టీ పేరులో ప్రజలు, తమిళనాడు, అభివృద్ధి కలిసి ఉండేలా ‘తమిళ మున్నేట్ర కళగం’ అనే పేరుపై మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

Latest News

More Articles