Friday, May 3, 2024

స్టార్ డైరెక్టర్ కుమారుడు.. భారత క్రికెట్లో సరికొత్త చరిత్ర

spot_img

71 ఏళ్ల వెటరన్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా కొడుకు ఇండియన్ క్రికెట్ లో చరిత్ర సృష్టిస్తున్నాడు. మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే, సంజూ, 12 ఫెయిల్ వంటి లాక్ బస్టర్స్ హిట్స్ ని తండ్రి విధు వినోద్ చోప్రా కొడుతుంటే.. వరుసగా సెంచరీలు బాదేస్తూ రికార్డులు తిరగరాస్తున్నాడు తనయుడు అగ్ని దేవ్ చోప్రా. అద్భుతమైన ఆటతో క్రికెట్ లవర్స్ ని అగ్ని దేవ్ అమితంగా ఆకట్టుకుంటున్నాడు. మిజోరం తరపున ఆడుతున్న రంజీ ట్రోఫీ ఎడిషన్‌లో బ్యాట్‌తో స్థిరమైన ఆటను ప్రదర్శిస్తున్నాడు. అండర్-19 స్థాయిలో ముంబై తరపున ఆడిన అగ్ని చివరి గ్రూప్‌లో మిజోరం తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.

ఇక ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లలో ఐదు సెంచరీలు కొట్టి హాట్ ఫామ్‌లో ఉన్నాడు అగ్ని దేవ్ చోప్రా. ఇక 25 ఏళ్ల అగ్ని ఆడుతున్న తొలి రంజీ సీజన్ లో తొలి 4 మ్యాచ్ ల్లో 5 సెంచరీలు బాది చరిత్ర సృష్టించాడు. దేశవాళీ క్రికెట్ లో ఇలా తొలి 4 మ్యాచ్ ల్లో సెంచరీలు చేసిన ఆటగాడు ఇతడొక్కడే. అగ్ని చోప్రా రంజీల్లో మిజోరం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ జట్లతో జరిగిన మ్యాచ్ ల్లో ఈ యువ ఆటగాడు సెంచరీలతో విరుచుకుపడ్డాడు. మేఘాలయపై రెండు ఇన్నింగ్స్ ల్లో రెండు సెంచరీలు చేయడం విశేషం.

Latest News

More Articles