Friday, May 17, 2024

సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ.. ప్రజాసేవకు కాదు!

spot_img

నేటితో సర్పంచ్, ఉప సర్పంచ్‎ల పదవీకాలం ముగిసిపోవడంతో పంచాయతీల్లో ప్రత్యేక పాలన ప్రారంభం కానుంది. అయితే సర్పంచ్, ఉప సర్పంచ్‎లను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. గత ఐదేళ్ల నుంచి గ్రామ ప్రజలకు సేవ చేసి, పదవీ విరమణ చేస్తున్న వారందరికీ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

‘ఐదేళ్ల కాలం తెలంగాణ ప్రజానీకానికి ఇతోధికంగా సేవచేసిన గ్రామ సర్పంచ్‌లు.. పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వారికి కృతజ్ఞతాభివందనాలు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠ ధామాలు నెలకొల్పడంలో, దేశానికి ఆదర్శంగా నిలిపిన కృషిలో మీ పాత్ర ఎనలేనిది. మీరు మరింతకాలం ప్రజాసేవలో ఉండాలని ఆశిస్తున్నాను’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

నేటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక పాలన ప్రారంభం కానుంది. నేటితో సర్పంచ్, ఉప సర్పంచ్‎ల పదవీకాలం ముగిసి మాజీలు అయిపోయారు. వీరి స్థానంలో పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారికి జాయింట్ చెక్ పవర్ ఇస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది. మేజర్ గ్రామ పంచాయతీలకు మండల ఉన్నతాధికారులను నియమించింది.

Latest News

More Articles