Saturday, May 18, 2024

టీఎస్ గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

spot_img

తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలపై విచారణ కొనసాగుతుందని.. ఈ సమయంలో పరీక్ష ఎలా నిర్వహిస్తారంటూ కొందరు కోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇవాళ (సోమవారం) జూన్ 5వ తేదీన విచారించిన హైకోర్టు.. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు అభ్యంతరం లేదంది. పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఇప్పటికే లక్షా 20 వేల మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది హైకోర్టు.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఈ నెల 11వ తేదీన ప‌రీక్ష నిర్వ‌హించేందుకు టీఎస్‌పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ప‌రీక్ష‌కు సంబంధించి టీఎస్‌పీఎస్సీ హాల్ టికెట్లు కూడా విడుద‌ల చేసింది. జూన్‌ 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.

Latest News

More Articles