Friday, May 17, 2024

మెడిసిన్ మధ్యలో మానేసి.. వ్యభిచార గృహం తెరిచిన విద్యార్థిని

spot_img

మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా సెంటర్‎పై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడులలో ముగ్గురు నిర్వాహకులను, పదిమంది యువతులను, 18 మంది విటులను బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. భద్రాచలం పట్టణానికి చెందిన రాయల శృతి అనే యువతి డాక్టర్ కావాలని అనుకంది. అందులో భాగంగా ఉక్రెయిన్‎లో మెడిసిన్ సీట్ సంపాదించింది. అక్కడ మెడిసిన్ మొదటి సంవత్సరం పూర్తిచేసి, రెండో సంవత్సరం ఫీజు చెల్లించలేక చదువు ఆపేసి, తిరిగి భద్రాచలానికి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత అమీర్ పేటలో ఎయిర్ హోస్టెస్‎గా శిక్షణ తీసుకుంది. ఆ శిక్షణకు అయ్యే ఖర్చు కోసం బంజారా హిల్స్‎లోని ఓ స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్‎గా పార్ట్ టైం జాబ్ చేసేది. అయితే ఆ వచ్చిన డబ్బు సరిపోకపోవడంతో ఎయిర్ హోస్టెస్‎ శిక్షణ కూడా మధ్యలోనే ఆగిపోయింది. డబ్బు లేకపోవడం వల్లే తన కలలు కలలుగానే మిగిలిపోయాయని శృతి భావించింది. డాక్టర్‎గా, ఎయిర్ హోస్టెస్‎గా కన్న కలలు తీరకపోవడంతో తేలిగ్గా డబ్బు సంపాదించాలని శృతి అనుకుంది.

ఈ క్రమంలో బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 10లోని ఓ అపార్ట్‎మెంట్లో రమణ ,జాహెద్ అనే వ్యక్తులతో కలిసి పర్పుల్ నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో స్పా సెంటర్‎ను ఏర్పాటు చేసింది. వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి ఆ అపార్ట్‎మెంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. దాడి చేసి శృతిని అరెస్ట్ చేశారు. కాగా.. కొన్నాళ్లకు ముందు కూడా శృతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మసాజ్ సెంటర్ తెరిచి వ్యాపారం మొదలుపెట్టింది. దాంతో పోలీసులు దాడిచేసి శృతిని అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన శృతి.. తిరిగి వ్యాపారం మొదలుపెట్టింది. ఈ క్రమంలో మరోసారి దాడి చేసిన పోలీసులు.. దాడిచేసి ముగ్గురు నిర్వాహకులతో పాటు 18 మంది విటులపై కేసు నమోదు చేసి రిమాండ్‎కు తరలించారు. పట్టుపడిన యువతులను రెస్క్యూ హోంకు తరలించారు.

Latest News

More Articles