Tuesday, May 21, 2024

భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్

spot_img

నాలుగేండ్ల క్రితం యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి.. మరోసారి అమెరికాను భయపెడుతోంది. అత్యంత ప్రమాదకరమైన కొవిడ్-19 హెచ్వీ.1 వేరియంట్ అమెరికా అంతటా వ్యాపిస్తున్నది. ఇంతకుముందు ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించిన ఈజీ.5, అకా ఎరిస్ సహా గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ఈ ‘హెచ్వీ.1’ వేరియంట్ ఎక్కువ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. అక్టోబర్ నెలాఖరు నాటికి అమెరికా వ్యాప్తంగా నమోదైన కొవిడ్-19 కేసుల్లో నాలుగో వంతు హెచ్వీ.1 వేరియంట్ కేసులే ఉన్నాయని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది. ముగిసిన రెండు వారాల్లో హెచ్వీ.1 వేరియంట్ కేసులు 25.2 శాతంగా నమోదయ్యాయి. దీంతో ప్రస్తుత శీతాకాలంలో ‘హెచ్వీ.1’ వేరియంట్ ఇతరులకు వ్యాపించకుండా చేపట్టాల్సిన నివారణ చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు.

Read Also: దంచికొడుతున్న వానలు.. రెండు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు బంద్‌

జూలైలో హెచ్వీ.1 వేరియంట్ కేసులు 0.5 శాతం మాత్రమే ఉండగా.. సెప్టెంబర్ నాటికి అవి 12.5 శాతానికి పెరిగాయి. హెచ్వీ.1 వేరియంట్ సోకిన వారిలో గొంతు నొప్పి, జలుబు, దగ్గు, తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, చలి వంటి లక్షణాలు ఉంటాయని అమెరికా వైద్యులు చెబుతున్నారు.

Latest News

More Articles