Sunday, May 19, 2024

విదేశాల్లో చదవాలనుకునే తెలుగు విద్యార్థులకు ఫండింగ్ చేస్తున్న కంపెనీ

spot_img

విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల సంఖ్య ఏటేటా అంతకంతకూ పెరుగుతోంది. ఇలా అంతర్జాతీయ విద్యను అభ్యసించాలనే విద్యార్థులకు గ్లోబల్ క్రాస్-బోర్డర్ ఫిన్‌టెక్ వేదిక HiWi అండగా నిలుస్తోంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ చెందిన విద్యార్థులకు 2023 సంవత్సరంలో 100 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా.. వీరిలో 5000 మంది విద్యార్థులను తమ సంస్థలోకి తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.

రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎక్కువ మంది విద్యార్థులు అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో చాలామంది ఎంఎస్ చేయాలనుకుంటున్నవారే ఉంటున్నారు. అయితే ఈ విద్యార్థులు ఒక్కొక్కరు చదువు కోసం సగటున 20,000 డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. అదే మొత్తంలో అక్కడ నివాసం తదితరాల కోసం ఖర్చుచేస్తున్నారు. అయితే ఈ ప్రాసెస్ చేయడానికి విద్యార్థులు, వారి కుటుంబాలకు విదేశీ చెల్లింపుల గురించి తెలియక చిక్కులు ఎదుర్కొంటున్నారు.

అలాంటి విద్యార్థుల ప్రత్యేక అవసరాలను సులభంగా తీర్చాలనే లక్ష్యంతో HiWi ముందుకొచ్చింది. ఈ క్యాలెండర్ సంవత్సరం చివరి నాటికి 2000 మందికి పైగా విద్యార్థులను విదేశాలకు పంపించాలని భావిస్తోంది. అందుకోసం వారి ఆర్థిక ప్రయాణాన్ని పర్యవేక్షించడంతో పాటు ఫీజు షెడ్యూల్‌, చెల్లింపులకు సంబంధించిన వాటిని సక్రమంగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. HiWi సహకారంతో విద్యార్థులు సజావుగా డబ్బును చెల్లించడంతో పాటు విదేశీ బ్యాంక్ ఖాతాలను ఏర్పాటుచేసుకోవచ్చు. వివిధ ఫైనాన్స్ అవకాశాలను కూడా అందిపుచ్చుకోవచ్చు. దాంతో నగదు నిర్వహణ మరియు అధిక విదేశీ మారకపు ఫీజులకు సంబంధించిన ఆందోళనల నుంచి ఉపశమనం లభించనుంది. విద్యార్థులకు అనుకూలమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన కరెన్సీ నిర్వహణ పరిష్కారాన్ని మార్గాలను కంపెనీ అందించనుంది.

HiWi కోఫౌండర్ & సీఈఓ గీతా చౌహాన్ మాట్లాడుతూ, ‘భారతీయ విద్యార్థుల కలలను HiWi అర్థం చేసుకుంటుంది. వారి లక్ష్యాలను సాధించడంలో వారికి మద్దతునిస్తూ కాంతి రేఖగా ఉంటుంది. వారికి ఎదురయ్యే సవాళ్ల గురించి కూడా మాకు తెలుసు. అందుకే వారి ఆర్థిక ప్రయాణాన్ని సరళీకృతం చేయడమే కాకుండా కొత్త దేశంలో జీవితాన్ని ఏర్పాటుచేసుకోవడానికి వారికి అవసరమైన సాయం చేయడానికి కృషి చేస్తున్నాం. మా ప్లాట్‌ఫారమ్ సౌకర్యవంతమైన నగదు బదిలీని నిర్ధారిస్తూ.. విద్యార్థులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి సహాయపడుతుంది. వారి విదేశీ విద్యా అనుభవాన్ని మరింత సులభం’ అని అన్నారు.

Latest News

More Articles