Saturday, May 18, 2024

ఔటర్ రింగ్ రోడ్డులో త్వరలో ఎకో ఫ్రెండ్లీ సోలార్ సైకిల్ ట్రాక్ 

spot_img

హైదరాబాద్ లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎకో ఫ్రెండ్లీ సోలార్ సైకిల్ ట్రాక్ త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ ప్రభాకర్. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర దాదాపు 23 కిలోమీటర్ల పొడుగునా అత్యాధునిక సౌకర్యాలతో జరుగుతున్న సోలార్ సైకిల్ ట్రాక్ పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు.

సోలార్ సైకిల్ ట్రాక్ నిర్మాణంలో కొన్ని చెట్లను తొలగించినట్లుగా వస్తున్న వార్తలను అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ ప్రభాకర్ ఖండించారు. వాస్తవానికి సోలార్ సైకిల్ ట్రాక్ నిర్మాణంలో తాము నిర్దేశిత ప్రమాణాలను పాటించామన్నారు. సోలార్ లైటింగ్ అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాట్లలో భాగంగా కొన్నిచోట్ల మొక్కలను తాత్కాలిక ప్రాతిపదికన తీసి అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణ పనులు పూర్తి అయిన తర్వాత వాటిని అదే ప్రాంతంలో ఏర్పాటు చేశామన్నారు. హెచ్ఎండీఏ మొక్కల పెంపకం విషయంలో..  గ్రీనరీ ఏర్పాటు విషయంలో ప్రజల మన్ననలు, ప్రశంసలు పొందుతుందని, సోలార్ ట్రాక్ నిర్మాణం అంశంలో ఎక్కడా కూడా పచ్చదనం పట్ల నిర్లక్ష్యం వహించలేదన్నారు డైరెక్టర్ ప్రభాకర్.

కొన్ని ఎన్జీవో సంస్థలు ఉద్దేశపూర్వకంగా హెచ్ఎండీఏ చేస్తున్న అనేక అభివృద్ధి పనులు, గ్రీనరీ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్టులపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్స్ పెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి వాటిని హెచ్ఎండీఏ ఇకపై తీవ్రంగా పరిగణిస్తుందన్నారు డైరెక్టర్ ప్రభాకర్.

Latest News

More Articles