Friday, May 17, 2024

హైదారబాద్‎లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు..రెండేళ్లలో 20శాతం పెరుగుదల.!

spot_img

దేశంలో సొంత ఇళ్లు కావాలని కలలు కంటున్న ప్రజలకు పెద్ద షాక్ తగిలింది. గత రెండేళ్లలో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఆ ఇల్లు వారి బడ్జెట్‌కు మించిపోయింది. క్రెడాయ్, కొలియర్స్, లియాస్ ఫోరస్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో గృహాలకు పెరిగిన డిమాండ్ కారణంగా, గత రెండేళ్లలో ఇళ్ల ధరలు సగటున 20 శాతం పెరిగాయి. అంటే రూ.50 లక్షల ఫ్లాట్ ధర రెండేళ్లలోనే రూ.60 లక్షలకు పెరిగిందని వెల్లడించింది.

డిమాండ్ కారణంగా గత రెండేళ్లలో ఎనిమిది నగరాల్లో ధరలు వేగంగా పెరిగాయని నివేదిక పేర్కొంది. ఈ ఎనిమిది నగరాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-NCR, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) పూణే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీల అపెక్స్ బాడీ అయిన క్రెడాయ్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్, డేటా అనలిటిక్స్ సంస్థ లియాస్ ఫోరస్ ఈ నివేదికను రూపొందించాయి. దీని ప్రకారం, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సిఆర్, కోల్‌కతా 2021 స్థాయిలతో పోలిస్తే 2023లో సగటు గృహాల ధరలలో అత్యధికంగా 30 శాతం పెరిగినట్లు తెలిపింది.

కరోనా తర్వాత ఇళ్లకు డిమాండ్ వేగంగా పెరిగిందని ఆంత్రిక్ష్ ఇండియా సీఎండీ రాకేష్ యాదవ్ అన్నారు. మరోవైపు కొత్త సరఫరా తగ్గిపోవడంతో మార్కెట్‌లో నిల్వల కొరత ఏర్పడింది. దీంతో ముడిసరుకు ధరలు వేగంగా పెరిగాయి. ఈ కారణాల వల్ల నిర్మాణ వ్యయం పెరిగింది. దీంతో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. అమ్మకాలు, సరఫరా, ధరలు పెరుగుతున్న తరుణంలో రియల్ ఎస్టేట్ పరిస్థితులు అత్యంత ఉత్పాదకతను కలిగి ఉన్నాయని, ధరల పెరుగుదలపై ఊహాగానాలు లేవని లియాస్ ఫోరస్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ అన్నారు.

ఇది కూడా చదవండి: కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి

Latest News

More Articles