Thursday, May 2, 2024

డ్రగ్స్ కేసు..శుక్రవారం విచారణకు దర్శకుడు క్రిష్.!

spot_img

హైదరాబాద్ లో రాడిసన్ హోటల్ కేంద్రంగా జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. మరికొందరి పాత్ర వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే అరెస్టు అయిన నిందితుల ఫొన్ డేటా, లావాదేవీల ఆధారంగా పోలీసులు కొంతమంది వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్ కు డ్రగ్స్ సరఫరా చేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు.

బుధవారం వివేకానంద్ డ్రైవర్ ప్రవీణ్ ను సైతం అదుపులోకి తీసుకున్నారు. అబ్బాస్ పలు మార్గాల్లో కొకైన్ తెచ్చి డ్రైవర్ ప్రవీణ్ కు ఇస్తున్నట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత ప్రవీణ్ వివేకా నంద్ కు అందిస్తున్నట్లు విచారణలో తేలింది. ప్రవీణ్, అబ్బాస్ ల మధ్య నగదు లావాదేవీలను పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న రఘు చరణ్, సందీప్, నీల్ శ్వేత , యూట్యూబర్ లిషి ఆచూకీ ఇంకా దొరకలేదు.

డ్రగ్స్ పార్టీకి సినీ దర్శకుడు హాజరైనట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు. తాను ముంబైలో ఉన్నానని శుక్రవారం వస్తానని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దర్యాప్తులో వెల్లడైన అంశాల ప్రకారం..వివేకానంద్ వారంతాల్లో హోటల్ కు వచ్చేవాడని..తన స్నేహితులతో పార్టీలు నిర్వహించేవాడని తెలిసింది. ఈ కేసులో మరింత మంది ప్రమేయం ఉన్నట్లు భావించి దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు అనేక సవాళ్లు ఎదరువుతున్నాయి. రాడిసన్ హోటల్లో మొత్తం 200 కెమెరాలు ఉన్నాయి. 20 మాత్రమే పనిచేస్తున్నట్లు పోలీసుుల తెలిపారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో సవాలుగా మారుతోంది. పార్టీలు నిర్వహించిన 1200,1204 గదుల సమీపంలో కెమెరాలు పనిచేయడం లేదని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: హైదారబాద్‎లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు..రెండేళ్లలో 20శాతం పెరుగుదల.!

Latest News

More Articles