Friday, May 17, 2024

మేడ్చల్ లో భారీగా నగదు పట్టివేత

spot_img

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.మేడ్చల్ జిల్లాలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. మేడ్చల్ పట్టణంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర 35 లక్షలు,వ్యాపారవేత నుండి  13 లక్షలు, గోల్డ్ షాప్ నుండి 5 లక్షల 68 వేల రూపాలతో పాటు 18 తులాల బంగారం, మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర వాహనాల తనిఖీలో 62900 రూపాయల పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

ఎన్నికల నియమనిబంధనల ప్రకారం స్క్రీనింగ్ కమిటీ ముందు డబ్బులను ప్రవేశపెట్టడం జరుగుతుందని సీఐ నరసింహ రెడ్డి చెప్పారు. డబ్బులు తరలించిన వ్యక్తులు సరైన పేపర్లను చూపిస్తే నగదును ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ పరిశీలన తర్వాత తిరిగి అప్పగిస్తామని తెలిపారు పోలీసులు.

ఇది కూడా చదవండి: రేవంత్ రాగానే కాంగ్రెస్ పార్టీ పని ముగిసిపోయింది

Latest News

More Articles