Sunday, May 19, 2024

మరో తిరుమలను తలపిస్తోన్న అయోధ్యాపురి..!!

spot_img

అయోధ్యలో నిర్మితమైన భవ్యరామమందిరానికి దేశం నలుమూలాల నుంచి తరలివస్తున్న భక్తులతో కిటకిటలాడుతోంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట తర్వాత సామాన్య భక్తులకు దర్శనం కలిపిస్తున్నారు. దీంతో దేశం నలుమూలల నుంచి రామ భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. రామయ్యను దర్శించుకోవడమే కాదు భారీగా విరాళాలు కూడా అందిస్తున్నారు. దీంతో తొలిరోజే రికార్డు స్థాయిలో దర్శనాలే కాదు అదేస్థాయిలో విరాళాలు కూడా వచ్చినట్లు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తెలిపింది.

భక్తులు స్వామివారికి కానుకలు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆలయానికి రాలేకపోయినవారు ఆన్ లైన్ ద్వారా విరాళాలు అందించే ఏర్పాట్లు కూడా చేశారు. దీంతో కౌంటర్లు, ఆన్ లైన్ ద్వారా మొదటి రోు 3.17కోట్ల విరాళాలు వచ్చినట్లు ఆలయ ట్రస్టు తెలిపింది.

తొలిరోజు రికార్డు స్థాయిలో భక్తులు బాలరాముడిని దర్శించుకున్నారు. మంగళవారం 5లక్షల మంది దర్శించుకున్నారు. రెండో రోజు 2.5లక్షల మంది శ్రీరాముడిని దర్శించుకున్నట్లు ఆలయ ట్రస్టు సభ్యులు తెలిపారు. భక్తుల తాకిడితో ఆలయ సమయాల్లో మార్పులు చేశారు. ముందుగా ఉదయం 7గంటల నుంచి 11.30గంటల వరకు ఉండేది. కానీ భక్తులు తాకిడి ఎక్కువగా ఉండటంతో ఉదయం 6 గంటలకే ఆలయాన్ని తెరిచి రాత్రి 10గంటలకు మూసివేస్తున్నారు. ఇలా భక్తుల తాకిడి, విరాళాలు చూస్తుంటే అయోధ్య మరో తిరుమలను తలపిస్తోందని భక్తులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: టీటీడీ కీలక నిర్ణయం..దర్శన టికెట్లు ఉన్న భక్తులకే గదులు..!!

Latest News

More Articles