Monday, May 6, 2024

డేటింగ్ నిజమే..కానీ అతనితో కాదు..బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా..!!

spot_img

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గతేడాది వరుస సినిమాలతో తెరపై సందడి చేసింది. కానీ ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోకయింది. త్వరలోనే ఎమర్జెన్సీ సినిమాతో మరోసారి అభిమానుల ముందు రానుంది. కంగనా ప్రధాన పాత్రల నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. భారతదేశం చీకటి క్షణాల వెనక దాగి ఉన్న కథను తెలుసుకోండి. చరిత్రలో ఎక్కువ భయపడిన, భయపెట్టిన ప్రధానమంత్రి జూన్ 14న థియేటర్ల చూడండి…అంటూ క్యాప్షన్ యాడ్ చేసింది. ఈ సినిమా దివంతగత ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కంగనా కనిపించనుంది.

ఇది కూడా చదవండి: జిమ్ లో ఈ తప్పులు చేయకండి..!!

అయితే తాజాగా ఈ అమ్మడి పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈజ్ మై ట్రిప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టితో తాను రిలేషన్లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై కంగనా రియాక్ట్ అయ్యింది. అవన్నీ ఉత్త మాటలేనని కొట్టిపారేసింది. దయచేసి ఇలాంటి అసత్య ప్రచారం చేయండి. ఇదే నా విన్నపం నిషాంత్ కు మ్యారేజ్ అయ్యింది. ఆయన వైవాహిక జీవితం సంతోషంగా ఉంది. నేను వేరొక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నాను. సరైన సమయం కోసం వేచి చూస్తున్నా. ఇబ్బందిపెట్టకండి . ఇద్దరు వ్యక్తులు కలిసి ఫొటోలు దిగినంత మాత్రానా ఇలా మాట్లాడటం సరికాదంటూ కోరారు.

Latest News

More Articles