Friday, May 17, 2024

న్యూజిలాండ్ హాస్ట‌ల్‌లో భారీ అగ్నిప్ర‌మాదం..!

spot_img

న్యూజిలాండ్‌లోని నాలుగు అంత‌స్థుల హాస్ట‌ల్ భ‌వ‌నంలో అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స్థానిక అధికారులు తెలిపారు.

హాస్ట‌ల్‌లో 92 రూమ్‌లు ఉండగా.. నిర్మాణ రంగం, హాస్పిట‌ల్ స్టాఫ్‌, ఇత‌ర రంగాల‌కు చెందిన వారు అందులో ఉంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో హాస్ట‌ల్‌లో 52 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది.

వెల్లింగ్ట‌న్‌ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌నపై ఆదేశ ప్ర‌ధాని క్రిస్ హిప్కిన్స్ స్పందించారు. ఈ ఘటన విచారకరమని, ఇది విషాదాన్ని నింపిన‌ట్లు పేర్కొన్నారు.

Latest News

More Articles