Wednesday, May 22, 2024

ఇన్‎స్టాగ్రామ్‎లో భారీ మోసం.. మహిళా టెకీ నుంచి కోటిన్నర దోపిడీ

spot_img

ఇన్‎స్టాగ్రామ్‎లో పోస్టులకు రేటింగ్ ఇవ్వాలంటూ ఓ మహిళకు టోకరా వేశారు. తాము సూచించిన పేజీలకు రేటింగ్, రివ్యూలు ఇస్తే కమీషన్ రూపంలో డబ్బులిస్తామని ఆశ చూపి.. మహిళా సాఫ్ట్‎వేర్ ఇంజనీర్ నుంచి ఏకంగా కోటిన్నర కోట్టేశారు. ఇంజనీర్ గా పనిచేస్తున్న మహిళకు ఇన్‎స్టాగ్రామ్‎లో సైబర్ కేటుగాళ్లు పరిచయమయ్యారు. రేటింగ్ ఇస్తే.. డబ్బులు వస్తాయని చెప్పారు. అందుకోసం ముందుగా కొంత నగదు డిపాజిట్ చేయాలన్నారు. దాంతో బాధితురాలు డిపాజిట్ చేసింది. ఆ తర్వా త ఆమె ఖాతా నుంచి సైబర్ నేరస్తులు కోటిన్నర కాజేశారు. కొన్ని రోజుల తర్వాత కమీషన్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

నకిలీ వేలిముద్రలతో జీహెచ్ఎంసీలో భారీ మోసం
జీహెచ్ఎంసీలో నకిలీ బయోమెట్రిక్‎తో భారీ మోసానికి తెరలేపారు. పారిశుద్ధ్య కార్మికుల నకిలీ వేలిముద్ర వేసి లక్షల రూపాయలు కొట్టేశారు. అభిలాష్, ఆనంద్ అనే ఇద్దరు వ్యక్తులు సనత్ నగర్ జీహెచ్ఎంసీలో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్‎లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ నకిలీ వేలిముద్రలతో 30 మంది పారిశుద్ధ్య కార్మికుల జీతాలను కొట్టేశారు. బాధితుల ఫిర్యాదుతో సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు.. నిందితులను అరెస్ట్ చేశారు.

Latest News

More Articles