Tuesday, May 21, 2024

రాత్రి 8 నుంచి 10 వరకే క్రాకర్స్ కాల్చేందుకు అనుమతి

spot_img

దీపావళి వేడుకలకు సంబంధించి జంట నగరాల ప్రజలకు హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య పలు సూచనలు చేశారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడంపై నిషేధం ఉందని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఈ అంశంపై గతంలో ఇచ్చిన తీర్పును కూడా సీపీ ప్రస్తావించారు.

పండుగ రోజు రాత్రి 8 నుంచి 10 వరకూ మాత్రమే క్రాకర్స్ కాల్చేందుకు అనుమతి ఉందన్నారు. క్రాకర్స్, డ్రమ్స్ నుంచి వెలువడే శబ్దానికి సంబంధించి పరిమితులు ఉన్నాయన్నారు. ఈ విషయంలో కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు 12వ తేదీ ఉదయం 6 నుంచి 15వ తేదీ ఉదయం ఆరు వరకూ అమల్లో ఉంటాయని తెలిపారు సీపీ సందీప్ శాండిల్య.

ఇది కూడా చదవండి: సినీ నటుడు చంద్రమోహన్‌ మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

Latest News

More Articles