Friday, May 17, 2024

డ్రంక్ అండ్ డ్రైవ్‌కు రూ. 15 వేల ఫైన్.. న్యూ ఇయర్ రూల్స్

spot_img

మరో మూడు రోజుల్లో న్యూ ఇయర్ సంబురాలు మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు నడుం బిగించారు. జరిమానాలతో హెచ్చరికలు చేస్తున్నారు. తాజాగా, న్యూ ఇయర్ వేడుకల సందర్భంలో హైదరాబాద్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. డ్రంక్ డ్రైవ్ చేస్తే రూ. 15 వేలు ఫైన్ వేస్తామని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం తొలిసారి ఈ అఫెన్స్ చేసినవారికి రూ. 10,000 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష కూడా పడొచ్చు. రెండో సారి ఈ నేరం చేసిన వారికి రూ. 15,000 ఫైన్, రెండేళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. రాత్రి 8 గంటలు దాటిన తర్వాత డ్రంక్ డ్రైవర్ల పట్టివేతకు చెకింగ్‌లు పెంచుతామని సిటీ పోలీసులు వెల్లడించారు.

ఇదే ఆసరాగా క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికుల నుంచి ఎక్కువగా చార్జీలు వసూలు చేసినా బాదుడు తప్పదు. ఇలా ఎక్కువ చార్జీలు వసూలు చేసే క్యాబ్ డ్రైవర్లకూ ఫైన్ వేయనున్నారు. ఆటో రిక్షాలు తప్పకుండా యూనిఫామ్ ధరించాలి. అన్ని డాక్యుమెంట్లు వెంట ఉంచుకోవాలి. ఒక వేళ వీళ్లు ప్రయాణికులను తీసుకెళ్లడానికి నిరాకరిస్తే రూ. 500 జరిమానా పడుతుంది. ఏ డ్రైవర్ అయినా కస్టమర్‌ను తీసుకెళ్లకుంటే వారు 9490617346 నెంబర్‌కు రిపోర్ట్ చేయవచ్చు. అలాగే.. పలు ఫ్లైఓవర్లను కూడా మూసేయనున్నట్టు తెలిపారు.

Latest News

More Articles