Wednesday, May 22, 2024

తెలంగాణలో రాగల 5 రోజులపాట వర్షాలు..!

spot_img

గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. కొంతమంది వడదెబ్బకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. అయితే ఈ సమయంలో హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది.

ఉత్తర గురజాత్ నుంచి మధ్య మహారాష్ట్ర దగ్గర కేంద్రీకృతమైన ఆవర్తనం అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ. ఎత్తులో కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నట్లు వాతావరణ శాక తెలిపింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టగా.. మొన్నటి వరకు 44.5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యింది. ఇవాళ 40 డిగ్రీలు ఉష్ణోగ్రత అధికంగా నమోదు అయ్యింది. మరో 5 రోజుల పాటు ఉష్ణోగ్రతల ప్రభావం తక్కువగా ఉంటుందని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ తెలిపింది.

ఇక ఏప్రిల్ లోనే ఎండలు ఇలా ఉంటే ఈ మాసం చివరితోపాటు మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనాలు ఆందోళన చెందుతున్నారు. మే నెలలో ఉష్ణోగ్రతలు 48 నుంచి 49 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎండలకు తోడుగా వడగాల్పుల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..గొయ్యిలో పడిన బస్సు.. 15మంది దుర్మరణం.!

Latest News

More Articles