Tuesday, May 21, 2024

ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..గొయ్యిలో పడిన బస్సు.. 15మంది దుర్మరణం.!

spot_img

ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్గ్ జిల్లాలో ప్రైవేట్ సంస్ధ ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సు మంగళవారం రాత్రి 8.30గంటల సమయంలో మట్టి గని వద్ద మొరం కోసం తవ్విన గోతిలో పడింది. ఈ ఘటనలో ప్రమాదస్థలంలోనే 11 మంది మరణించగా..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 12మందికిపైగా గాయపడ్డారు. ఓ డిస్టిలరీ కంపెనీలో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగులను ఇళ్లకు తీసుకువస్తున్న బస్సు కుమార్హీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాప్రీ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కకు జారి 40 అడుగల లోతు ఉన్న గొయ్యిలో బస్సు పడినట్లు సమాచారం.

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో జరిగిన బస్సు ప్రమాదం చాలా బాధాకరమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇందులో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలా సాయం అందించడంలో నిమగ్నమై ఉందని ప్రధాని ట్వీట్ చేశారు.

అంతకుముందు, సీఎం సాయి కూడా బస్సు ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేశారు . ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స కోసం పూర్తి ఏర్పాట్లు చేశామని, గాయపడిన వారిని ఆదుకోవడంలో యంత్రాంగం బిజీగా ఉందని చెప్పారు.

డియా డిస్టిలరీ కంపెనీ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, ఒకరికి ఉద్యోగం, క్షతగాత్రుల ఖర్చు మొత్తం భరిస్తామని తెలిపింది. క్షతగాత్రులందరినీ ఎయిమ్స్, అపెక్స్ ఓం, ఇతర ఆసుపత్రులలో చేర్చారు. బస్సులో మొత్తం 40 మంది ఉన్నారు. మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ కేసులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తెలిపారు.

ఇది కూడా చదవండి: కూల్ డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగిన రెండేళ్ల బాలుడు.!

Latest News

More Articles