Tuesday, May 21, 2024

బ్యాంకులు రూ. 2 వేల నోటు తీసుకోకపోతే ఇలా చేయండి

spot_img

తాజాగా ఆర్బీఐ రూ. 2 వేల నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చింది. దాంతో వినియోగదారులు బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. ఖాతాదారులను బ్యాంకులు ఇబ్బంది పెట్టొద్దని ఆర్బీఐ సూచించింది. కాగా.. రూ.2000 నోట్లను డిపాజిట్‌ చేసుకోవడానికి బ్యాంక్‌లు నిరాకరిస్తే ఖాతాదారులు బ్యాంకు మేనేజర్‎ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని తెలిపింది. ఫిర్యాదు చేసిన తర్వాత 30 రోజుల్లోగా పరిష్కారం లభించకపోతే ఆర్బీఐకి ఫిర్యాదు చేయాలని సూచించింది.

ఇకపోతే ఖాతాదారులకు బ్యాంకు ఖాతా లేకపోయినా కూడా రూ.2000 నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. 2023 మే 23 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ఆయా బ్యాంక్‌ల్లో ఖాతాలు లేనివారు కూడా ఏ బ్యాంక్‌ శాఖల్లోనైనా రూ.20,000 పరిమితి వరకూ రూ.2000 నోట్లను మార్పిడి చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.

Latest News

More Articles