Sunday, May 12, 2024

ఆగకుండా తుమ్ములు వస్తున్నాయా…అయితే డేంజర్..

spot_img

తుమ్ములు రావడం అనేది చాలా సహజలక్షణం. చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వయసు వారి దాకా ఏదో ఒక సమయంలో తుమ్ములు వస్తూనే ఉంటాయి. కానీ ఎందుకు వస్తాయనేది మాత్రం చాలా మందికి తెలియదు.అయితే తుమ్ములు ఎప్పుడో ఒక సారి వస్తే పర్వాలేదు. కానీ ఎక్కువగా వస్తున్నాయంటే కచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. చాలా మందికి జలుబు చేసినప్పుడు ఎక్కువగా తుమ్ములు వస్తుంటాయి. అలా కాకుండా కొన్ని సార్లు ఇతర సమస్యలతో కూడా తుమ్ములు వస్తుంటాయి. ఎక్కువగా అలెర్జీ కారణంతోనే తుమ్ములు వస్తాయి.

అలెర్జీకి నిరంతర ముక్కు కారటం, కళ్ళు దురద, గొంతు నొప్పి, ఎరుపు ముఖం, ఎర్రటి కళ్ళు, చర్మంపై దద్దుర్లు అలాగే మరెన్నో అనేక లక్షణాలు ఉంటాయి.అయితే వీటన్నింటిలో కామన్ లక్షనం ఏంటంటే తుమ్ములు రావడమే. తుమ్ములు అనేవి ఎక్కువగా వస్తున్నాయంటే కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాల్సిందే. అయితే తుమ్ములతో పాటు మీ బాడీలో ఇంకా వేరే లక్షణాలు ఏమైనా కనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. అలెర్టీ కాకుండా నాసికా చికాకు, దుమ్ము, ఫ్లూ, నాసికా రద్దీ, ముక్కు పొడిబారడం, జలుబు, వైరస్లు మొదలైన అనేక ఇతర కారణాలను కలిగి ఉంటాయి.

తుమ్ములు ఇంట్లో ఉన్నప్పుడే ఎక్కువగా వస్తున్నాయంటే మాత్రం కచ్చితంగా ఇంటిని క్లీన్ చేసుకోవాలి. అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం మన నుంచి ఇతరులకు అలెర్టీ అంటుకునే అవకాశాలు ఉంటాయి. ఇక బయటకు వెళ్లినప్పుడు కూడా తుమ్ములు ఎక్కవుగా వస్తున్నాయంటే కచ్చితంగా అలెర్టీ కారణం అని గుర్తుంచుకోవాలి. అలాంటి సమయంలోనే ముక్కుకు అడ్డుగా శుభ్రమైన క్లాత్ ను పెట్టుకుని బయటకు వెళ్తే బెటర్. దాంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడా ఎంతో ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. చాలామందికి తెలియక అలెర్జీ కలిగించే ఆహారాలను తీసుకుంటారు.

అలా కాకుండా అలెర్జీ లేని ఆహారాలను తీసుకోవాలి. దాంతో పాటు మనం వేసుకునే బట్టలు కూడా ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడప్పుడు తుమ్ములు వస్తే దాన్ని లైట్ తీసుకోవాలి. కానీ తరచూ తుమ్ములు వస్తున్నాయంటే మాత్రం కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి: రైత‌న్న‌ల‌ కోసం ప‌ల్లె ప‌ల్లెకు వెళ్ల‌నున్న కేసీఆర్

Latest News

More Articles