Saturday, May 11, 2024

రైత‌న్న‌ల‌ కోసం ప‌ల్లె ప‌ల్లెకు వెళ్ల‌నున్న కేసీఆర్

spot_img

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వారం రోజులుగా ఎండిన పంటపోలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అందుకు సంబంధించిన నివేదికను అధినేతకు అంద జేయడంతో పాటు.. స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్య‌టించి రైతుల‌కు భ‌రోసా క‌ల్పించాల‌ని అభ్యర్దించారు. అందుకు అనుగుణంగా స్పందించిన కేసీఆర్ తనను కలిసిన కంచర్ల బ్రదర్స్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

నల్లగొండ మండలం ముషంపల్లితో పాటు ఆలేరు నియోజకవర్గ పరిధిలో పర్యటించాలని కేసీఆర్‌ నిర్ణయించారు.10 ఏండ్లుగా ఎండిపోని పంట పొలాలు ఈ సారి ఎందుకు ఎండి పోయాయ‌ని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితిని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వివరిస్తుంటే తట్టుకోలేక పోయిన కేసీఆర్ తక్షణమే తానే క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టిస్తాన‌ని, ఎండిన‌ పొలాలను పరిశీలిస్తానని జగదీష్ రెడ్డితో మాట్లాడి రూట్ మ్యాప్ తయారు చేయాల‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది. అత్యధికంగా బోర్లు వేసి నష్టపోయిన నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామం నుంచే ఈ పరిశీలన మొదలుపెట్టేలా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాన్ని రూపొందిస్తోంది.

ఆ తర్వాత న‌ల్గొండ జిల్లా త‌ర్వాత వ‌రంగ‌ల్ ,మెద‌క్, రంగారెడ్డి జిల్లాలోనూ కేసీఆర్ ప‌ర్య‌టించ‌నున్నారు కేసీఆర్. క్షేత్ర స్థాయిలో రైతుల క‌ష్టాల‌ను చూసి, వారిలో ధైర్యాన్ని నింప‌నున్నారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో రైతులు నిర్ల‌క్ష్యాన్నికి గుర‌వుతున్న తీరును ఎండ‌గ‌ట్ట‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: దానం ఓట‌మి ఖాయం.. సికింద్రాబాద్‌లో మ‌న‌కు పోటీ బీజేపీతోనే

Latest News

More Articles