Sunday, April 28, 2024

భారీగా పెరగనున్న రీఛార్జ్ ప్లాన్ ధరలు

spot_img

టెలికాం కంపెనీలు యూజర్లకు భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. బిజినెస్ రంగంలో తమ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు వినియోగదారుల తాకిడిని కూడా పెంచుకునేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కావడంతో క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పాయి. అతి తక్కువ ధరకే అన్ లిమిటెడ్ ప్యాక్‌ను అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్ సంస్థ తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఐపీఎల్ సీజన్ వరకు మాత్రమే వర్తిస్తుందని కూడా తెలిపింది. అయితే తాజాగా రీఛార్జ్ ధరలను పెంచుతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

లోక్‌సభ ఎన్నికలు 2024 సమీపిస్తున్న వేళ టెలికాం రంగాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వినియోగదారులపై భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. లోక్ సభ ఎన్నికలు పూర్తవ్వగానే మరోసారి వినియోగదారులకు షాక్ ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపారు. టారీఫ్ ఛార్జీలను పెంచాలని టెలికాం రంగాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ముగిసిన వెంటనే అమలు చేయనున్నట్లు సమాచారం. కాగా, గత రెండేళ్లుగా టెలికాం కంపెనీలు ఛార్జీల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే తాజాగా ఎన్నికలు ముగిసాక ఒక్కో టెలికాం సంస్థ 15 నుంచి 20 శాతం వరకు పెంచే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

కస్టమర్ నుంచి వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు ఛార్జీలు పెంచనున్నట్లు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కొంతకాలం నుంచి కంపెనీలు ఛార్జీలు పెంచాలని ఆలోచిస్తున్నాయి. ఈ సమయంలో ఇప్పటికే ఇన్వెస్టర్లతో జరిగిన పలు సమావేశాల్లో కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చినట్లు సమాచారం. 4జీ, 5జీ సేవలు వచ్చినప్పటి నుంచి టెలికాం సంస్థలు ధరలను పెంచుతూ వస్తున్నాయి. అయితే ఈసారి పెంచే ధరల్లో కొత్తగా వచ్చే వినియోగదారులకు స్పెషల్ ప్లాన్స్ రెడీ చేస్తోంది.

5జీ సేవల కోసం టెలికాం కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టాయి. అప్పటి నుంచి ఎటువంటి ఛార్జీల పెంపులు చేయలేదు. అయితే పెట్టిన పెట్టుబడులతో కంపెనీలకు ఖర్చులు కూడా అంతే పెరిగిపోయాయి. దీంతో ఖర్చు పెట్టిన ఆదాయాన్ని తిరిగి సంపాదించుకునేందుకు వినియోగదారులపై భారాన్ని మోపనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: రైత‌న్న‌ల‌ కోసం ప‌ల్లె ప‌ల్లెకు వెళ్ల‌నున్న కేసీఆర్

Latest News

More Articles