Friday, May 17, 2024

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూకుడు

spot_img

కేంద్రం జీఎస్టీని ప్రవేశ పెట్టినప్పటి నుంచి రాష్ట్రం ఏటికేడు వృద్ధిని సాధిస్తూనే ఉన్నది. 2019-20వ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రూపంలో రూ.31,187 కోట్లు వస్తాయని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేయగా, మొదటి మూడు నెలల్లోనే రూ. 6,326 కోట్ల రాబడి వచ్చింది. బడ్జెట్‌ అంచనాల్లో ఇది 20 శాతం. 2020-21లో బడ్జెట్‌లో రూ.32,671 కోట్లు వస్తాయని భావించగా.. జూన్‌ వరకు రూ.3,956 కోట్లు వచ్చాయి. 2021-22లో రూ.35,520 కోట్లు వస్తాయని ఆర్థికశాఖ ఆశించిగా మొదటి మూడు నెలల్లో రూ. 6641 కోట్లు సమకూరాయి.

అయితే.. కరోనా, లాక్‌డౌన్‌ ఉన్న రెండేండ్లు జీఎస్టీ రాబడి కూడా కాస్త తగ్గింది. ఆ తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితికి చేరింది.2022-23వ ఆర్థిక సంవత్సరంలో రూ.42,189 కోట్లు జీఎస్టీ రూపంలో వస్తాయని అంచనా వేయగా, జూన్‌ వరకు రూ. 9,645 కోట్లు వచ్చాయి. బడ్జెట్‌ అంచనాల్లో ఇది 23 శాతం. ఇక.. ఈ ఆర్థిక సంవత్సరం రూ.50,942 కోట్లు సమకూరుతాయని ఆశించగా, మొదటి త్రైమాసికంలో రూ.11,418 కోట్లు జీఎస్టీ రూపంలో ఖజానాకు చేరాయి. బడ్జెట్‌ అంచనాల్లో ఇది 23 శాతం. ఇలా.. ఏటికేడు జీఎస్టీ వసూళ్లలో వృద్ధిని నమోదు చేస్తూ ఆర్థికంగా మరింత బలమైన శక్తిగా రాష్ట్రం ఎదుగుతున్నది.

Latest News

More Articles