Thursday, May 2, 2024

రేవంత్ వ్యాఖ్యలపై పోలీస్ శాఖ సీరియస్

spot_img

రేవంత్ వ్యాఖ్యలపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. నిన్న మహబూబ్ నగర్ లో రేవంత్ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పోలీసులని దుర్భాషలాడుతూ అసభ్యపదజాలంతో బూతులు తిట్టాడు రేవంత్. దాంతో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్దమైయ్యారు పోలీసులు. కానిస్టేబుల్ నుండి డీజీ స్థాయి వరకు రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పడుతున్నారు.

100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అపుడు పోలీసుల బట్టలు విప్పుతాం అని అనుచిత వ్యాఖ్యలు చేశాడు రేవంత్. ఈ వ్యాఖ్యలను రేవంత్ వెనక్కి తీస్కోకపోతే రేవంత్ పై నిరసనగా పోలీసుల ఆందోళనలు చేపట్టారు. అవసరమైతే రేవంత్ కు బందోబస్త్ ను సైతం చేయమంటున్నారు పోలీసులు.

Latest News

More Articles