Saturday, May 18, 2024

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా..నేడు టీడీపీ నేతల నిరాహార దీక్షలు..!!

spot_img

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నేడు నిరాహారదీక్షలకు పిలుపునిచ్చారు టీడీపీ నేతలు. అయితే ఈ దీక్షలకు హాజరుకాకుండా అడ్డుకునేందుకు నాయకుల ఇళ్ల వద్ద భారీగా మోహరించారు పోలీసులు. ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రులు సోమిరెడ్డి, నారాయణ , కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలను హౌస్ అరెస్టు చేశారు. ఏపీలో అన్ని జిల్లాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. దీంతో ఎలాంటి నిరసనలు, ఆందోళలనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు పోలీసులు. అయినప్పటికీ కూడా నిరాహారదీక్షలకు సిద్ధం అవుతున్నారు నేతలు.

ఇది కూడా చదవండి: గుడ్‎న్యూస్ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!!

ఇక విజయవాడ వైవేపై హైడ్రామా అనంతరం మంగళగిరి కార్యాలయానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా చివరికి మూడు వాహనాలతో విజయవాడ వెళ్లేందుకు పవన్ అనుమతి పొందారు. అర్థరాత్రి తర్వాత తన కాన్వాయతో విజయవాడుకు వెళ్లారు. చంద్రబాబు అరెస్టు పరిణామం నేపథ్యంలో ఆయన్ను కలిసేందుకు వెళ్తున్న పవన్ ను పోలీసులు తెలంగా, ఆంధ్ర సరిహద్దులోని గరికపాడు చెక్ పోస్టు దగ్గర అడ్డుకున్నారు. మంగళగిరి కార్యాలయానికి వెళ్లి తీరుతానని పట్టుబట్టడంతో అక్కడే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి పరిస్థితులను పోలీసులు పవన్ కు వివరించారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. చర్చల అనంతరం మూడు వాహనాల్లో పవన్ కల్యాణ్ విజయవాడకు చేరుకున్నారు.

Latest News

More Articles