Saturday, May 4, 2024

గుడ్‎న్యూస్ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!!

spot_img

పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. మరోసారి బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం. మనదేశంలో చాలా మంది బంగారాన్ని ఇష్టపడుతుంటారు. దీనికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ చిన్న పండగ వచ్చినా…సరే బంగారం, వెండి నగలు కొనుగోలు చేయాల్సిందే. ముఖ్యంగా మహిళలు బంగారంపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. గత రెండు మూడు రోజులుగా పెరిగిన బంగారం, వెండి ధరలు నేడు కాస్త తగ్గింది. రానున్నది పండగల సీజన్ కావడంతో బంగారానికి మరింత డిమాండ్ పెరగనుంది.

ఇది కూడా చదవండి: క‌వి జ‌య‌రాజ్‌కు కాళోజీ పుర‌స్కారం ప్ర‌దానం

ఇదిలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగానే తగ్గాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు చూసినట్లయితే…హైదరాబాద్ మార్కట్లో నేడు పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 రూపాయలు తగ్గి రూ. 59, 840గా నమోదు అయ్యింది. అదే సమయంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150లు తగ్గి రూ. 54, 850 పలుకుతోంది. ఇక వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 500తగ్గి…రూ. 77వేలుగా నమోదు అయ్యింది.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో పదికి పది సీట్లు మనవే

Latest News

More Articles