Monday, May 20, 2024

ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు షాక్.. వాడకపోతే డీయాక్టివ్‌

spot_img

యూపీఐ యూజర్లకు నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ షాక్ ఇచ్చింది. వాడకంలో లేని యూపీఐ ఐడీలను డీయాక్టివ్ చేస్తామంటూ ప్రకటించింది. ఈ ప్రక్రియను ప్రారంభించాలని గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌పే తదితర పేమెంట్‌ యాప్స్‌, బ్యాంక్‌లను నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ఆదేశించింది. ఒక ఏడాదికంటే మించి యాక్టివ్‌గా లేని ఐడీలను, నంబర్లను క్లోజ్‌ చేయాలంటూ యూపీఐ సభ్య సంస్థలన్నింటికీ సర్క్యులర్‌ జారీచేసింది. 2023 డిసెంబర్‌ 31 నాటికల్లా ఈ మార్గదర్శకాల్ని అమలు చేయాలంటూ థర్డ్‌పార్టీ యాప్‌ ప్రొవైడర్లు, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను బ్యాంకుల్ని కోరింది.

Read Also: హైదరాబాద్ బాగుంటే తెలంగాణ బాగుంటుంది

ఖాతాదారులు మొబైల్‌ ఫోన్‌ నంబర్లను మార్చుకున్నపుడు వారికి సంబంధం లేని ఖాతాలకు డబ్బు బదిలీ అయ్యే ప్రమాదం ఉన్నందున ఎన్‌పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పలువురు కస్టమర్లు కొత్త మొబైల్‌ నంబర్‌ను తీసుకున్నప్పటికీ, పాత నంబరును బ్యాంకింగ్‌ సిస్టమ్‌ నుంచి తొలగించకపోవడం, పాత నంబరును మరొకరికి టెలికం ఆపరేటరు జారీచేయడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతుందని ఎన్‌పీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అందుకే ఒక ఏడాదికాలంగా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగని యూపీఐ యాప్‌లు, యూపీఐ ఐడీలు, యూపీఐ నంబర్లను ప్రొవైడర్లు గుర్తించి, ఆ కస్టమర్‌ ఐడీలను, నంబర్లను డీయాక్టివేట్‌ చేయాలని ఎన్‌పీసీఐ సర్క్యులర్‌లో పేర్కొంది.

Latest News

More Articles