Saturday, May 4, 2024

హైదరాబాద్ బాగుంటే తెలంగాణ బాగుంటుంది

spot_img

ఒక్క కేసీఆర్‎ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష నాయకులు దండు కట్టుకొని వస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన శుక్రవారం రాత్రి ఖైరతాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఖైరతాబాద్ బడా గణేష్ సెంటర్ వద్దకు చేరుకున్న మంత్రి కేటీఆర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దానం నాగేందర్‎కి మద్దతుగా మాట్లాడారు.

Read Also: కేసీఆర్‌పై ఇండియా టుడే కవర్‌ పేజీ స్టోరీ.. తెలంగాణ అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన కేసీఆర్

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ బాగుంటే తెలంగాణ బాగుంటుంది. హైదరాబాద్‎లో తొమ్మిదిన్నర ఏళ్లలో ఎలాంటి గొడవలు లేకుండా అన్నదమ్ముల్లా కలిసికట్టుగా ముందుకు వెళుతున్నం. ఇక్కడ జరిగిన అభివృద్ధి వల్ల ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు ఇక్కడకు వలస వస్తున్నారు. కేసీఆర్ వచ్చాక తెలంగాణ, హైదరాబాద్‎లో ఎంత మార్పు జరిగిందో గమనించాలి. ఆనాడు కరెంట్ కోతలు ఉండేవి.. వారానికి మూడు రోజులు పవర్ హాలిడేలు ఉండేవి. అలాంటి పరిస్థితుల నుండి 24 గంటల కరెంట్ తెచ్చుకున్నం. హైదరాబాద్ జనాభా ఎంత పెరిగినా కృష్ణ గోదావరి నుండి నీళ్ళు తెచ్చుకుంటున్నాం. హైదరాబాద్‎కి ఐదేళ్ల తర్వాత కొత్తవాళ్ళు వస్తే ఇది మన హైదరాబాదా అని ఆశ్చర్య పోయేలా అభివృద్ధి చేస్తున్నం. ప్రతి గల్లి, ప్రతి మూలకు మెట్రో విస్తరించాల్సిన అవసరం ఉంది. బలమైన నాయకత్వం, స్థిరమైన నాయకత్వం ఉండాలి. కాంగ్రెస్ నాయకులు గోతి కాడ నక్కలా చూస్తున్నారు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న నాయకులు తెలంగాణను దోచుకునేందుకు సిద్దమవుతున్నరు. కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం ఎంతకైనా దిగజారుతారు. మళ్ళీ కాంగ్రెస్ చేతిలో పెడితే అనవసర అల్లర్లు, మతకల్లోహాలు వస్తాయి. ఒక్క కేసీఆర్‎ని ఎదుర్కొనేందుకు దండు కట్టుకొని వస్తున్నారు. మేం ఎవరికి భయపడం.. మాకు మీరు ఉన్నారు, మాకు మీపై విశ్వాసం ఉంది. కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్‎లో పెట్టుబడుల వరద కోనసాగుతుంది. అల్లాటప్ప రియల్ ఎస్టేట్ బ్రోకర్ గాళ్లతో ఇలాంటి అభివృద్ధి జరగదు. ఢిల్లీ వస్తాం.. అక్కడ గులాబీ జెండా ఎగురవేస్తాం. ఈ నెల 30న కారు గుర్తుకు ఓటువేసి దానం నాగేందర్‎ని గెలిపించాలని కోరుతున్న’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Latest News

More Articles