Saturday, May 18, 2024

బంగ్లాదేశ్ లో తీరం దాటిన తుపాన్ …తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.?

spot_img

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుఫానుగా బలపడింది. గత రాత్రి బంగ్లాదేశ్ తీరంలో తీరం దాటిందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారానికి ఈ తుపాను బలహీనపడుందని తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఉన్న ఉపరిత ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని తెలిపారు. దక్షిణ అండమాన్ వద్ద సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 5 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

కాగా భారత వాతావరణ విభాగం ప్రకారం మిథిలి ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఏమాత్రం కనిపించడం లేదు. ఆ తుఫాన్ బంగ్లాదేశ్ లో తీరం దాటడంతో దాని జోరు తగ్గింది. ప్రస్తుతం గంటకు 25 కిలోమీటర్ల వేగంతో మాత్రం ఉండటంతో ఏపీ , తెలంగాణ చిరు జల్లులు కూడా కురిసే అవకాశం లేదు.

అండమాన్ నికోబార్ లో మరో తుఫాన్ తరహా వాతావరణం ఉన్నా అక్కడ పెద్దగా మేఘాలు కనిపించడం లేదు. ఇప్పుడు సౌత్ ఇండియాలో మేఘాలు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో చలి మరింత పెరగనుంది. శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాల ప్రకారం ఇవాళ ఉత్తర తెలంగాణ తప్ప, మిగతా ప్రాంతాల్లో మేఘాలు వచ్చి పోతుంటాయి. రాత్రికి ఉత్తర తెలంగాణలో చలి బాగా పెరుగుతుంది.

ఇది కూడా చదవండి: కేసీఆర్‌పై ఇండియా టుడే కవర్‌ పేజీ స్టోరీ.. తెలంగాణ అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన కేసీఆర్

 

Latest News

More Articles