Saturday, May 18, 2024

అమెరికా ఆరోపణలపై భారత్‌ సీరియస్‌‌..!

spot_img

అమెరికాలో ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నును హతమార్చేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై భారత్ సీరియస్ అయింది. ఈ కేసు దర్యాప్తు చేసేందుకు ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఇది కూడా చదవండి: టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడు పీచర వెంకటేశ్వర్‌రావు కన్నుమూత

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్య వ్యవహారంలో ఇప్పటికే భారత్‌, కెనడా దేశాల మధ్య ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూను హతమార్చేందుకు పన్నిన కుట్రను అమెరికా భగ్నం చేసిందని బ్రిటిషన్‌ దినపత్రిక కథనంలో పేర్కొనడం కలకలం రేపింది. ఈ కుట్రలో భారతదేశం ప్రమేయం ఉందని అమెరికా ఆరోపించడంతో పాటు భారత్‌కు హెచ్చరికలు జారీ చేసింది. అయితే, హత్య ఘటన ఎప్పుడు జరిగిందో మాత్రం పేర్కొనలేదు.

Latest News

More Articles