Saturday, May 18, 2024

ఉప్పల్ మ్యాచ్‎లో భారత్ ఓటమి.. అభిమానుల హార్ట్ ముక్కలుచేసిన స్పిన్నర్ హార్ట్‎లే

spot_img

ఉప్పల్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్‌పై ఇంగ్లాండ్‌ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ముగిసిన తొలి టెస్టులో భారత్‌ ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఇరు జట్లూ విజయం కోసం హోరాహోరి పోరాడినా.. ఇంగ్లండ్‌ తమ అద్భుత బౌలింగ్‌తో భారత్‌కు షాకిచ్చింది. నాలుగో రోజు ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 420 పరుగుల భారీ స్కోరు చేయడంతో భారత్‌ ముందు 231 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఛేదనలో భారత టాపార్డర్‌, మిడిలార్డర్‌ బొక్క బోర్లా పడింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌.. 69.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఫలితంగా ఇంగ్లండ్‌.. 28 పరుగుల తేడాతో గెలుపొందింది. ఛేదనలో119 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన భారత్‌ను అశ్విన్‌, శ్రీకర్‌ భరత్‌‎లు ఆదుకోవడంతో భారత్‌ విజయానికి చేరువగా వచ్చినా.. తొలి టెస్టు ఆడుతున్న ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ టామ్‌ హర్ట్లీ తన స్పిన్‌తో భారత్‌ను చుట్టేసి ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతడు ఏడు వికెట్లు తీసి భారత్‌ను దెబ్బతీశాడు. ఫలితంగా 5 టెస్ట్ ల సిరీస్ లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

ఫలితం ఆఖరి రోజుకు తేలడం ఖాయమని, అశ్విన్‌ – భరత్‌లు సోమవారం ఉదయం వరకూ ఆటను తీసుకెళ్తారని ఆశించిన భారత్‌ అభిమానులకు హర్ట్లీ వరుస షాకులిచ్చాడు. ఆట మరో రెండు ఓవర్లలో ముగుస్తుందనగా భరత్‌ను హర్ట్లీ బౌల్డ్‌ చేయడంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అతడి బౌలింగ్ లోనే తర్వాతి ఓవర్లో అశ్విన్‌ ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్‌ అయ్యాడు. ఆఖరి బ్యాటర్‌గా వచ్చిన సిరాజ్‌.. బుమ్రాతో కలిసి 25 పరుగులు జోడించి భారత శిభిరంలో ఆశలు రేపినా.. హర్ట్లీ వేసిన ఆఖరి ఓవర్లో సిరాజ్‌ స్టంపౌట్‌ కావడంతో ఇంగ్లండ్‌ విజయం సాధించింది.

Read Also: ప్రియుడు దూరం పెట్టాడని సూసైడ్ చేసుకున్న సాఫ్ట్‎వేర్ ఇంజనీర్

Latest News

More Articles