Friday, May 3, 2024

శతకాలతో దద్దరిల్లిన బెంగళూరు..పలు రికార్డులు నమోదు

spot_img

బెంగళూరు: వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటికే సెమీస్‌కు చేరిన భారత జట్టు.. ఆదివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించింది. ప్రపంచకప్‌లో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది. 2007 బెర్ముడాపై 413/5 స్కోరు సాధించగా.. తాజాగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో410/4 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 62 బంతుల్లో సెంచరీ చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఇదే వేగవంతమైన సెంచరీ కావడం గమనార్హం.

Also Read.. కర్ణాటకలో కాంగ్రెస్ విఫలమైంది. ఆ పార్టీకి ఓటేస్తే కారు చీకట్లే

భారత బ్యాటర్లు నెదర్లాండ్స్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. శతకాలు, అర్ధశతకాలతో కదం తొక్కారు. శ్రేయస్‌ అయ్యర్‌ 127 నాటౌట్ (93 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లు), కె.ఎల్‌.రాహుల్‌ 102 (64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకాలతో చెలరేగగా.. ఓపెనర్లు రోహిత్‌ శర్మ 61 (54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుభ్‌మన్‌ గిల్‌ 51 ( 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. విరాట్‌ కోహ్లీ 51 ( 56 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) మరోసారి అర్ధ సెంచరీ నమోదు చేశాడు.  నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్‌ లీడ్ రెండు వికెట్లు తీయగా, వాన్‌ డెర్‌ మెర్వే, వాన్‌ మీకేరెన్ చెరో వికెట్‌ తీశారు.

రికార్డులు బ్రేక్ చేసిన రోహిత్  

ఒకే సంవత్సరంలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. 2015లో ఏబీ డివిలియర్స్‌ 58 సిక్స్‌లు కొట్టాడు. ఇప్పుడు ఈ ఏడాది రోహిత్ 60 సిక్స్‌లతో ఆ రికార్డును అధిగమించాడు. ఈ వరల్డ్‌ కప్‌లోనే హిట్‌మ్యాన్‌ 24 సిక్స్‌లు బాదడం విశేషం. కెప్టెన్‌గా ఒక వరల్డ్‌ కప్‌లో అత్యధిక సిక్స్‌ల రికార్డును ఇప్పటికే రోహిత్ అధిగమించాడు. 2019లో ఇంగ్లాండ్‌ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 22 సిక్స్‌లు కొట్టాడు.

Latest News

More Articles