Tuesday, May 21, 2024

సఫారీలతో సై అంటున్న భారత సేన.. నేటి నుంచి టీ20 సిరీస్

spot_img

సొంతగడ్డపై కంగారూలను చిత్తు చేసి టీ20 సిరీస్‌ చేజిక్కించుకున్న యువభారత జట్టు.. సఫారీ పర్యటనకు సిద్ధమైంది. సుదీర్ఘంగా సాగనున్న ఈ టూర్‌లో ఆదివారం దక్షిణాఫ్రికాతో టీమ్‌ఇండియా తొలి టీ20 మ్యాచ్‌ ఆడనుంది. వచ్చే ఏడాది అమెరికా వేదికగా పొట్టి ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో.. అందులో చోటు దక్కించుకునేందుకు యువ ఆటగాళ్లకు మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ చక్కటి అవకాశం కానుంది.

Read Also: శారీరకంగా వాడుకొని వదిలేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

నిరుడు టీ20 ప్రపంచకప్‌ ముగిసినప్పటి నుంచి పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్న రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీతో పాటు కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, జస్ప్రీత్‌ బుమ్రా ఈ సిరీస్‌కు అందుబాటులో లేకపోగా.. సూర్యకుమార్‌ జట్టును నడిపించనున్నాడు. ఇతర దేశాలతో పోల్చుకుంటే భిన్నంగా ఉండే.. దక్షిణాఫ్రికా పిచ్‌లపై పెద్దగా అనుభవం లేని యువ ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారో చూడాలి. అయితే పొట్టి ఫార్మాట్‌లో సఫారీలపై మన రికార్డు మెరుగ్గా ఉండటం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నది. గత ఎనిమిదేండ్లలో దక్షిణాఫ్రికా చేతిలో టీమ్‌ఇండియా టీ20 సిరీస్‌ కోల్పోలేదు. చివరిసారిగా 2015లో భారత్‌పై సఫారీ జట్టు పొట్టి సిరీస్‌ గెలిచింది.

Latest News

More Articles