Tuesday, May 14, 2024

కెనడాలో భారత విద్యార్థిపై అమానుష దాడి.. సమగ్ర దర్యాప్తునకు కాన్సులేట్‌ డిమాండ్..!!

spot_img

న్యూఢిల్లీ: కెనాడాలోని బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌లో భారత సిక్కు విద్యార్థిపై జరిగిన దాడిని ఇండియన్‌ కాన్సులేట్‌ తీవ్రంగా ఖండించింది. గత సోమవారం జరిగిన ఈఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు కెనడాలోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

Also Read.. బారాముల్లా జిల్లా ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

వరల్డ్‌ సిక్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కెనడా నివేదిక ప్రకారం.. ఓ బస్ట్‌స్టాప్‌లో 17 ఏళ్ల సిక్కు విద్యార్థిపై స్థానిక విద్యార్థులు దాడి చేశారు. బస్సు ఎక్కే విషయంలో వారి మధ్య గొడవ జరిగింది. బస్సు ఎక్కకుండా అడ్డుకోవడంతోపాటు బస్సులో కూడా వేధింపులకు పాల్పడ్డారు.

Also Read.. దటీజ్ కేసీఆర్.. నిన్న 8 ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల‌ ప్రారంభించి.. నేడు 1,447 కోట్లు ఇచ్చారు..!!

విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్‌ సిక్కు విద్యార్థితోపాటు గొడవపడుతున్న యువకులను కిలోవ్నా బస్టాప్‌లో దించేశాడు. బస్సు దిగిన తర్వాత ఆ ఇద్దరు విద్యార్థులు సిక్కు విద్యార్థిని కాళ్లతో తంతూ విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి అక్కడ వైరల్‌ అయ్యింది.

Latest News

More Articles