Sunday, May 19, 2024

దటీజ్ కేసీఆర్.. నిన్న 8 ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల‌ ప్రారంభించి.. నేడు 1,447 కోట్లు ఇచ్చారు..!!

spot_img

హైద‌రాబాద్ : ఒకేసారి 9 ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించి దేశ వైద్య రంగంలోనే స‌రికొత్త రికార్డు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది.  8 కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం మొత్తం రూ. 1,447 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నిధులతో ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా కాలేజీలు, ల్యాబ్స్, సెమినార్ హాల్స్, అనుబంధ ఆసుపత్రి భవనాలు, హాస్టల్ భవనాల నిర్మాణం, ఇతర వసతులను కల్పించనున్నారు.

Also Read..మరోసారి ‘నోబెల్‌’ ప్రైజ్ మనీ పెంపు..

2014 వరకు తెలంగాణలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా.. ఇప్పుడవి 26కు చేరుకున్నాయి. వచ్చే ఏడాదికి గాను మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. దీంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 34కు చేరుకుంది.

Also Read.. మీ కారు మైలేజీ పెరగాలంటే…ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి..!!

8 కాలేజీల నిర్మాణానికి రూ. 1,447 కోట్లు నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి పాలనలో జిల్లాకొక డిగ్రీ కాలేజీలు కూడా లేని పరిస్థితి ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ దార్శనిక పాలనలో జిల్లాకో మెడికల్ కాలేజీ మంజూరు చేసుకున్నామని, ఏటా 10వేల మంది వైద్యులను తయారు చేసే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ పాలనలో తెలంగాణ మెడికల్ హబ్ గా అవతరించిందని పేర్కొన్నారు.

 

Latest News

More Articles