Friday, May 3, 2024

మరోసారి ‘నోబెల్‌’ ప్రైజ్ మనీ పెంపు..

spot_img

నోబెల్‌ బహుమతి గ్రహీతలకిచ్చే నగదు మొత్తాన్ని పెంచుతున్నట్లు నోబెల్‌ ఫౌండేషన్‌ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతమున్న 10 మిలియన్ క్రోనార్ల నుంచి 11 మిలియన్ క్రోనార్లకు పెంచుతున్నట్లు తెలిపింది. దాంతో నోబెల్ అవార్డు గెలుచుకున్న వారు ప్రస్తుతం పెంచిన ప్రైజ్ మనీతో దాదాపు రూ. 8.15 కోట్లు అందుకోనున్నారు. ఇటీవలి కాలంలో స్వీడన్‌ కరెన్సీ క్రోనార్‌ విలువ పడుతూ లేస్తూ ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

Read Also: హైదరాబాద్‎లో కాంగ్రెస్ జాతీయ నేతల స్కాంలతో పోస్టర్లు.. సోనియా, రాహుల్ సహా కీలక నేతలు

ఫౌండేషన్ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. 2012లో అవార్డు సొమ్మును 10 మిలియన్ల నుంచి 8 మిలియన్లకు తగ్గించారు. ఆ తర్వాత 2017లో 9 మిలియన్లకు పెంచారు. తిరిగి మూడేండ్ల తర్వాత 2020లో 10 మిలియన్లకు నిర్ణయించారు. కాగా.. గత పది సంవత్సరాల నుంచి స్వీడిస్ క్రౌన్ విలువ 30 శాతం తగ్గింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతమున్న 10 మిలియన్ల నుంచి 11 మిలియన్లకు పెంచుతున్నట్లు నిర్ణయించారు. కాగా.. ఫౌండేషన్ ప్రారంభంలో మొదటిసారి నోబెల్ ప్రైజ్ మనీ కింద 8 మిలియన్ల క్రోనార్లు ఇచ్చేవారు.

Latest News

More Articles