Friday, May 17, 2024

అక్టోబర్ 2 నుంచి ‘స్వచ్ఛతా హి సేవ’..

spot_img

వచ్చే నెల అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించబోయే ‘స్వచ్ఛతా హి సేవ’లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా, పర్వతగిరి మండల కేంద్రంలో ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… ‘స్వచ్ఛతా హి సేవా’ (SHS)లో భాగంగా సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. చెత్త రహిత భారతదేశం తయారుచేయడానికి ఈ కార్యక్రమం నాంది పలుకుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అన్ని ముఖ్యమైన ప్రదేశాల నుండి చెత్తను తొలగించడం, చెత్తకుండీలు, పబ్లిక్ టాయిలెట్లు, ధలావోలు, వ్యర్థ రవాణా వాహనాలు, MRFలు మొదలైన అన్ని పారిశుద్ధ్య ఆస్తుల మరమ్మత్తు, పెయింటింగ్, శుభ్రపరచడం మరియు బ్రాండింగ్ తదితర కార్యక్రమాలు చేపట్టాలి అన్నారు.

Read Also: కరువు నృత్యం చేసిన భూముల్లో.. కృష్ణమ్మ జల తాండవం!

మంత్రి సమక్షంలో బీఆర్ఎస్‎లో చేరిన యాదవ సంఘం, దేవరుప్పుల బీజేపీ, వైఎస్ఆర్టీపీ నాయకులు
పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి మండల కేంద్రంలో యాదవ సంఘం నాయకులు, పెద్ద గొల్ల సలేంద్ర సోమన్న యాదవ్ అధ్వర్యంలో సుమారు 50 యాదవ కుటుంబాలు, అలాగే దేవరుప్పుల మండలానికి చెందిన బీజేవైఎం నేత ఆకవరం రాజు, మల్లేష్, వైఎస్ఆర్టీపీ నేత వీరేష్ అధ్వర్యంలో 50 మంది నాయకులు, రాయపర్తి మండలం కోలన్ పల్లికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేయాలన్నారు. యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో యాదవులకు న్యాయం జరిగిందన్నారు. మంత్రి ఎర్రబెల్లిని మరోసారి భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు.

Latest News

More Articles