Friday, May 17, 2024

మీ కారు మైలేజీ పెరగాలంటే.. ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి!

spot_img

ఒక్కప్పుడు ధనవంతుల ఇంట్లో మాత్రమే కారు ఉండేదు. ఇప్పుడు మధ్య తరగతి కుటుంబాల్లో కూడా కొంతమంది కారును మెయింటైన్ చేస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజీల్ ధరలు కాస్త ఆందోళనకు గురిచేస్తున్నాయి. దూర ప్రాంతాలకు కుటుంబంతో వెళ్లాలంటే కారు తీయాల్సిందే. కానీ ఇంధనం ధరలు చూస్తే మాత్రం గుండె గుబేల్ మంటుంది. అలాంటి తరుణంలో మీకుకూడా కారు ఉన్నట్లయితే…మీరు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే కారు మైలేజీని పెంచుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఓసారి చూద్దాం.

కంపెనీ టైర్లు మాత్రమే వాడండి:

కారు టైర్ పాడైపోయినప్పుడల్లా, కంపెనీ టైర్లను మాత్రమే బిగించాలి. ఎందుకంటే కంపెనీ టైర్లు కాకుండా అసెంబుల్ టైర్లు కొన్నిసార్లు కారు యొక్క అసలు టైర్ పరిమాణాన్ని మించిపోతాయి. ఇది కారు మైలేజీపై ప్రభావం చూపుతుంది. అందుకే చిన్నకార్లకు పెద్ద టైర్లను ఫిట్ చేయకూడదు.

ఇది కూడా చదవండి: వైద్య చరిత్రలోనే అరుదైన కేసు.. కడుపులో బిడ్డకు డెంగ్యూ

రూఫ్:

చాలా SUVలలో రూఫ్ పట్టాలు అందుబాటులో ఉన్నాయి. తమ వస్తువులన్నింటినీ మోసుకెళ్తారు. దీనిని చూసి, కొంతమంది తమ చిన్న కార్లలో వీటిని ఇన్‌స్టాల్ చేసుకుంటారు, కానీ దీని కారణంగా కారు మైలేజ్ ప్రభావితమవుతుంది.

కారు వేగాన్ని జాగ్రత్తగా చూసుకోండి:

మీ కారు మంచి మైలేజీని ఇవ్వాలనుకుంటే, గంటకు 55-65 కిలోమీటర్ల వేగంతో నడపడానికి ప్రయత్నించాలి, ఎందుకంటే కారును అత్యధిక వేగంతో నడపడం వల్ల మైలేజ్ తగ్గుతుంది. మీ కారు వేగాన్ని గంటకు 55-65 కిలోమీటర్లలో ఉంచడానికి మీ వంతు ప్రయత్నం చేయండి.

టైర్ ప్రెషర్‌ చెక్ చేయండి:
ప్రతి వాహన యజమాని మొదటి బాధ్యత తన కారు టైర్ ప్రెషర్‌ని తనిఖీ చేయడం తప్పనిసరి. కారు టైరుకు సంబంధి గాలిని ఎప్పటికప్పుడు చేసుకుంటే కారు మంచి మైలేజీని ఇస్తుంది.

ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలకు బదులుగా:
ఇంటి నుండి బయలుదేరే ముందు, Google Mapsను ఒకసారి చెక్ చేయండి, తద్వారా మీరు ట్రాఫిక్ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ట్రాఫిక్‌లో కారు మైలేజ్ తగ్గుతుంది. ట్రాఫిక్ లో ఎక్కువ సేపు ఇంజిన్ ఆన్ లో ఉంటుంది కాబట్టి అధిక ఇంధన ఖర్చు అవుతుంది. అంతేకాదు ఆ సమయంలో క్లచ్ ఎక్కువగా ఉపయోగిస్తాం. కాబట్టి రద్దీగా ఉండే ప్రదేశాలలో కారు నడపడం మానుకోవాలి.

Latest News

More Articles