Wednesday, May 15, 2024

అక్కడ లీటర్ పెట్రోల్ రూ. 331, డీజిల్ రూ. 329

spot_img

దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా పొరుగుదేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే విద్యుత్‌ బిల్లుల పెంపుతో ఆ దేశ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారు. తమ విద్యుత్ బిల్లులను తగలబెడుతూ.. డిస్కమ్ సంస్థల అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇది చాలదన్నట్లు పాక్‎లో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇప్పటికే సెప్టెంబర్ 1న పెట్రోల్ మీద రూ. 14, డీజిల్ మీద రూ. 18 పెంచిన ప్రభుత్వం.. తాజాగా మరోసారి ఆ ధరలను భారీగా పెంచింది. పెట్రోల్ మీద రూ. 26.02 పైసలు, డీజిల్ మీద 17.34 పైసలు పెంచుతున్నట్ల ప్రకటించింది. దాంతో లీటరు పెట్రోల్ ధర రూ. 331.38 పైసలకు చేరుకోగా, డీజిల్ ధర రూ.329.18 పైసలకు చేరింది.

Read Also: తెలంగాణ ప్రభుత్వంలో రోజూ పండుగే

ఇప్పటికే తినడానికి తిండి లేక అల్లాడుతున్న ప్రజలపై ప్రభుత్వం నిర్ణయం భారీ ప్రభావం చూపనుంది. ఆయిల్ ధరలు పెరగడంతో.. నిత్యావసరాల ధరలు కూడా పెరిగి అవకాశముందని వ్యాపారులు అంటున్నారు.

Latest News

More Articles