Tuesday, May 7, 2024

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శం

spot_img

రాష్ట్రంలోని  నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం లాంటివన్నారు రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్, ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్. ఇవాళ( శనివారం) మానకొండూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎం రిలీఫ్ పండ్, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రసమయి.. తెలంగాణ రాకముందు ఆడబిడ్డ పుట్టిందంటే నెత్తిమీద కుంపటిగా తల్లిదండ్రులు భావించేవారని, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ఆడబిడ్డ పుడితే అదృష్ట లక్ష్మిగా భావిస్తున్నారన్నారన్నారు.

సీఎం కేసీఆర్ పేదల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.

Latest News

More Articles