Sunday, May 19, 2024

బ్యాడ్మింటన్‌కు సాయిప్రణీత్‌ గుడ్‌బై

spot_img

బ్యాడ్మింటన్‌ క్రీడకు యువ షట్లర్‌ సాయిప్రణీత్‌ వీడ్కోలు పలికాడు. గత కొన్నేండ్లుగా గాయాలతో ఇబ్బంది పడుతున్న సాయిప్రణీత్‌ కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు నిన్న(సోమవారం) తన ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ప్రకటించాడు. గాయాలతో ఫిట్‌నెస్‌ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రణీత్‌  తెలిపాడు. ఈ తన సుదీర్ఘ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ప్రణీత్‌..కృతజ్ఞతలు తెలిపాడు. అమెరికాలో ఒక క్లబ్‌కు సేవలు అందించబోతున్నట్లు తన భవిష్యత్‌ ప్రణాళికను వివరించాడు. దేశ బ్యాడ్మింటన్‌పై తనదైన ముద్ర వేసిన సాయి ప్రణీత్‌.. కెరీర్‌కు వీడ్కోలు పలుకడంపై స్పందిస్తూ ‘డియర్‌ బ్యాడ్మింటన్‌ థాంక్యూ..అన్ని రకాల భావాల మేళవింపుతో ఇది రాసుకొస్తున్నాను. బ్యాడ్మింటన్‌తో 24 ఏండ్లకు పైగా ఉన్న సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలుకుతూ రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నాను. ఈ రోజు నుంచి కెరీర్‌లో కొత్త చాప్టర్‌ మొదలుపెడుతున్నాను. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన అందరికీ రుణపడి ఉంటాను అని ట్వీట్ చేశాడు సాయిప్రణీత్.

ఇది కూడా చదవండి: మార్చి 12 నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభం

Latest News

More Articles