Sunday, May 12, 2024

ఆరేండ్ల బాబుకు హార్ట్ఎటాక్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

spot_img

గుండెపోటు మరణాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా యువకులు కూడా హార్ట్‌ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవలే అనేకం చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాతనే ఈ తరహా ఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. కాగా, తాజాగా గుండెపోటుతో ఆరేళ్ల బాలుడు మరణించడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి తనువు చాలించాడు.

Read Also: ‘కుష్బూ’ ఫ్లెక్సీకి చీపురు దెబ్బలు..

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌కు చెందిన రాహుల్‌ జైన్‌ అనే వ్యాపారవేత్తకు ఒక్కగానొక్క కొడుకు విహాన్‌ జైన్‌ (6) ఉన్నాడు. ఓ కార్పొరేట్‌ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. అయితే, ఇటీవలే విహాన్‌ అనారోగ్యానికి గురయ్యాడు. తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించడంతో కోలుకుని తిరిగి ఇంటికొచ్చాడు. ఈ క్రమంలో ఫ్యామిలీ ఫంక్షన్‌ కోసం రాహుల్‌ తన కుటుంబంతో కలిసి గత వారం ఢిల్లీ వెళ్లాడు. అక్కడ విహాన్‌ మరోసారి అస్వస్థతకు గురికావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు శనివారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. అయితే, వైద్య పరీక్షల్లో విహాన్‌కు మయోకార్డిటిస్‌ అనే అరుదైన వైరస్‌ సోకినట్లు తేలింది. ఈ వైరస్‌ గుండె కండరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కండరాల వాపునకు కారణమవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో గుండెకు రక్తం సరఫరాలో అవాంతరాలు ఎదురవుతాయని.. ఫలితంగా గుండె అకస్మాత్తుగా ఆగిపోతుందని వివరించారు.

Latest News

More Articles