Friday, May 17, 2024

మనవడికి గిఫ్ట్‌ గా రూ.240కోట్ల విలువైన షేర్లు

spot_img

ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి 4 నెలల తన మనవడు ఏకాగ్రహ్‌ రోహన్‌ మూర్తికి రూ.240 కోట్ల విలువైన షేర్లను గిఫ్ట్‌ గా ఇచ్చారు. దీంతో రోహన్ మూర్తి యంగ్‌ మిలియనీర్‌గా నిలిచారు. రోహన్ మూర్తికి 15లక్షల ఇన్ఫోసిస్ షేర్లు నారాయణ మూర్తి గిఫ్ట్ గా ఇచ్చారు. కంపెనీలో మొత్తం విలువలో షేర్లు 0.04శాతం. ప్రస్తుతం నారాయణ మూర్తి వాటా ఇన్ఫోసిస్‌లో 0.40శాతం నుంచి 0.36శాతానికి తగ్గింది. ప్రస్తుతం ఆయనకు కంపెనీలో దాదాపు 1.51కోట్ల షేర్లున్నాయి. ఆఫ్ మార్కెట్‌ డ్రేడ్‌లో లావాదేవీలు జరిగినట్లు ఫైలింగ్‌లో తెలిపారు.

ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి- సుధామూర్తి తనయుడు ..రోహన్‌ మూర్తి, అపర్ణ కృష్ణన్‌ కు గతేడాది నవంబర్‌లో కొడుకు పుట్టాడు. దాంతో నారాయణమూర్తి తాత అయ్యారు. ఆ బాబుకి ఏకాగ్రహ్‌ రోహన్ మూర్తిగా పేరు పెట్టారు. నారాయణమూర్తి-సుధా మూర్తి దంపతులకు కూతురు కూడా ఉన్నారు. ఆమె అక్షతా మూర్తి. ఆమె బ్రిటిష్‌ ప్రధాని రిషి సునాక్‌ భార్య.

నారాయణమూర్తి ఇన్ఫోసిస్‌ను 1981 సంవత్సరంలో స్థాపించారు. కంపెనీ మార్చి 1999లో నాస్‌డాక్‌లో లిస్ట్‌ అయ్యింది. ఇటీవల సుధామూర్తి ఇటీవల రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు.

ఇది కూడా చదవండి: అమెరికాలో తెలంగాణ వ్యక్తికి ప్ర‌తిష్టాత్మక పుర‌స్కారం

Latest News

More Articles