Thursday, May 2, 2024

వాహనాల తనిఖీ.. రూ.5.73కోట్ల విలువైన బంగారం పట్టివేత

spot_img

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాల్లో పోలీస్‌ యంత్రాంగం నిఘా పెడుతూ ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ దగ్గర పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్ట‌గా.. తనిఖీల్లో రూ.5.73 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చందన దీప్తి తెలిపారు.

ఇవాళ(సోమవారం) ఉదయం 11.30 గంటల సమయంలో మిర్యాలగూడ టౌన్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా.. వాహనంలో రూ.5.73కోట్ల బంగారాన్ని గుర్తించిన‌ట్టు తెలిపారు. బంగారం, వ్యాన్‌తో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్పీ  వివరించారు.

ఇది కూడా చదవండి: అమెరికాలో తెలంగాణ వ్యక్తికి ప్ర‌తిష్టాత్మక పుర‌స్కారం

 

Latest News

More Articles