Saturday, May 18, 2024

న‌వంబ‌ర్ 1 నుంచి ఇన్ఫోసిస్ ఉద్యోగుల వేత‌న పెంపు

spot_img

ద‌స‌రా వేడుక‌ల సంద‌ర్భంగా దేశీ ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్  ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. న‌వంబ‌ర్ 1 నుంచి ఉద్యోగుల‌కు వేత‌న పెంపు చేప‌ట్ట‌నుంది. కంపెనీ హెచ్ఆర్ చీఫ్ ష‌జి మ్యాథ్యూ టౌన్‌ హాల్ మీటింగ్ సంద‌ర్భంగా ఈ విష‌యం  తెలిపారు. గ‌త కొద్దినెల‌లుగా ఇన్ఫోసిస్ వార్షిక వేత‌న పెంపును వాయిదా వేస్తున్న క్ర‌మంలో కంపెనీ ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో టెకీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇన్ఫోసిస్ స‌హ‌జంగా సీనియ‌ర్ మేనేజ్‌మెంట్ దిగువ‌న ఉద్యోగుల‌కు ఏటా ఏప్రిల్‌లో, ఇత‌రుల‌కు జులైలో వేత‌న పెంపు చేప‌డుతుంది. ఐటీ ప‌రిశ్ర‌మలో ప్ర‌తికూల ప‌రిస్ధితుల దృష్ట్యా ఈ ఏడాది వేత‌న పెంపును కంపెనీ వాయిదా వేస్తూ వ‌చ్చింది. వేత‌న పెంపును వాయిదా వేసేందుకు కంపెనీలో నెల‌కొన్న సామ‌ర్ధ్య లేమి కార‌ణ‌మ‌ని ఇన్వెస్ట‌ర్ కాల్ సంద‌ర్భంగా ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో నిలంజ‌న్ రాయ్ చెప్పారు.

ఇది కూడా చదవండి: ప్రగతి భవన్‌ దసరా వేడుకల్లో పాల్లొన్న సీఎం కేసీఆర్

Latest News

More Articles