Sunday, May 19, 2024

70 కిలోమీటర్ల దూరం నుంచి అద్భుతంగా జాబిల్లి..!

spot_img

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రయోగించిన చంద్రయాన్-3 కీలక దశకు చేరువైంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్‌-3 సేఫ్ ల్యాండింగ్‌ను చూసేందుకు యావత్‌ భారతదేశంతోపాటు ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశం కోసం విక్రమ్‌ ల్యాండర్‌ ఫోటోలు తీస్తూ.. అన్వేషణ కొనసాగిస్తోంది. కాగా, 70 కిలోమీటర్ల దూరం నుంచి జాబిల్లి ఫొటోలను ల్యాండర్‌ తన కెమెరాతో తీసింది. ఈ ఫొటోలను ఇస్రో సోషల్ మీడియాలో విడుదల చేసింది.

Latest News

More Articles