Friday, May 17, 2024

‘స్లీప్‌ మోడ్‌’కు ల్యాండర్‌, రోవర్‌..!!

spot_img

న్యూఢిల్లీ: చంద్రుడి దక్షిణ ధృవంపై లూనార్‌ నైట్‌ ప్రారంభం కానున్నది. ఇది 14 రోజులు కొనసాగనుంది. ఈ సమయంలో చంద్రుడి దక్షిణ ధృవం వద్ద ఉష్టోగ్రతలు మైనస్‌ 200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయని ఇస్రో వెల్లడించింది. లూనార్‌ నైట్‌ సమయంలో సూర్య కాంతి ఉండదు. దీంతో విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ పని చేసేందుకు విద్యుత్‌ ఉత్పత్తి చేసే సోలార్‌ ప్యానల్స్‌ పని చేయవు. ఈ నేపథ్యంలో ల్యాండర్‌, రోవర్‌ను స్లీప్‌ మోడ్‌లోకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇస్రో తెలిపింది.

ఇది కూడా చదవండి : సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఖమ్మం జిల్లా రైతుల ఆర్తి తీరుస్తాం.. మంత్రి పువ్వాడ ఎమోషనల్..!!

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సన్‌ మిషన్‌ ఆదిత్య ఎల్1ను ఇస్రో శనివారం విజయవంతంగా ప్రయోగించింది. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ మాట్లాడారు. చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటి వరకు సుమారు 100 మీటర్ల దూరం ప్రయాణించిందని వెల్లడించారు. మరోవైపు చంద్రుడి దక్షిణ ధృవంపై ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణించిన మార్గం చిత్రాన్ని ఇస్రో షేర్ చేసింది.

Latest News

More Articles