Friday, May 17, 2024

ఈ ఆలయాన్ని దర్శిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకం …ఆ ఆలయం ఎక్కడుందో తెలుసా..!!

spot_img

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి సమీపంలో ఉన్న బిక్కవోలు ప్రాంతం. దాదాపు కొన్ని వందల ఏళ్లకిందట అక్కడ స్వయంభుగా సుబ్రమణ్యస్వామివారు కొలువై ఉన్నారు. జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఈ ఆలయానికి ప్రత్యేక పేరు ఉంది. ప్రధానంగా ఇక్కడ స్వామిని దర్శిస్తే..మనలో ఉన్న దోషాలు కచ్చితంగా తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు. ప్రత్యేకమై రోజు అంటూ ఏదీ లేకుండా ఈ దివ్యక్షేత్రంలో ఏడాదిపాటునా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. మహిళలు సంతానం కోసం స్వామివారిని దర్శించుకుని ఆచారం ప్రకారం ఒక పసుపు వస్త్రం వారికి సమర్పిస్తారు. ఈ వస్త్రం ధరించి ఆ రాత్రి అక్కడ నిద్రిస్తే స్వామి కలలో వచ్చి వారికి సంతాన భాగ్యం అందిస్తారని ఒక విశ్వాసంతో మహిళలు ఈ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఎంతో మంది సంతానం పొందినవారు ఉన్నారని చరిత్ర చెబుతోంది.

స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పర్వదినం సుబ్రమణ్య షష్టి. ఆరోజు వేలాది మంది భక్తులు ఈ దివ్య క్షేత్రానికి తరలిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేక దేవాలయంగా పేరుగాంచిన ఈ ఆలయంలో వేకువజామునుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. సంతానం లేని ఎంతో మంది మహిళలు ఆలయ ఆనవాయితీ ప్రకారం పసుపు చీర ధరించి స్వామి స్వప్నంలో కనిపిస్తారని ఆలయంలో గోడ దగ్గర పడుకుని స్వామివారి స్వప్నం కోసం ఎదురుచూసిన ఘట్టం కూడా ప్రత్యేకమైందని ఈ ప్రాంతంలో చెప్పుకుంటారు.

ఇది కూడా చదవండి: గృహలక్ష్మీ దరఖాస్తులు వృథా

Latest News

More Articles