Sunday, May 19, 2024

మనీ ప్లాంట్ కాదు ఈ మొక్క మీ ఇంట్లో ఉండే డబ్బుకు కొదవే ఉండదట..!!

spot_img

వాస్తు శాస్త్రంలో మొక్కలకు చెట్లకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇంట్లో మొక్కలు, చెట్లు అన్నీ కూడా వాస్తు ప్రకారం నాటితే వాస్తు దోషం తొలగిపోతుందని నమ్ముతుంటారు. అలాగే ఇంట్లో మరింత పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందని చాలా మంది నమ్మకం. ఈ వాస్తు శారీరక, మానసిక, ఆర్థిక, కుటుంబ సమస్యలను తొలగించి ఇంట్లో శాంతిని పొందేందుకు సహాయపడుతుంది. సాధారణంగా ఇంట్లో తులసి, మనీ ప్లాట్, స్నేక్ ప్లాంట్ లాంటి మొక్కలను నాటుతుంటారు. కానీ దానిమ్మ మొక్క గురించి చాలా మందికి ఎన్నో విషయాలు తెలియవు.

ఇది కూడా చదవండి: ఉదయం లేవగానే చాయ్ తాగుతున్నారా?అయితే భారీ నష్టం తప్పదు..!!

వాస్తు శాస్త్రం ప్రకారం..ఇంట్లో దానిమ్మ చెట్లను నాటడం వల్ల విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లబిస్తుంది. ఇంట్లో ఆనందం, శాంతి కాపాడుతుంది. సంపదకు ఎలాంటి లోటు ఉండదు. వాస్తు నిపుణుల ప్రకారం దానిమ్మ అద్రుష్టాన్ని , ఆనందాన్ని, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు. దీని రంగు ఎరుపు హ్రుదయాన్ని సూచిస్తుంది. ఇది జీవితంలో శ్రేయస్సును తెస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

వాస్తు ప్రకారం ఇంటి ముందు లేదా ప్రవేశ ద్వారా వద్ద కుడి వైపున దానిమ్మ చెట్టును నాటడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. ఈ ప్రదేశంలో ఈమొక్కను నాటితే లక్ష్మీ దేవి సంతోషిస్తుంది. దీంతోపాటు ఆనందం,శ్రేయస్సు, అద్రుష్టాన్ని తెస్తుంది. దీంతో ఇంట్లో సంపదకు లోటుండదు. వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశలో దానిమ్మను నాటకూడదు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తి తీసుకువస్తుంది. దీంతోపాటు కుటుంబంలో గొడవలు జరుగుతాయి.

ఇది కూడా చదవండి: నేటి నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ..!!

Latest News

More Articles